Sushanth : వినోదాన్ని నింపుకున్న ‘మా నీళ్ళ ట్యాంక్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు టాలీవుడ్ లోని యువ కథానాయకులందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది. వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలకు వాళ్ళు పచ్చజెండా ఊపేస్తున్నారు. సినిమాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండటం కంటే కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సీరిస్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలా తాజాగా ఓటీటీ బాట పట్టిన హీరో సుశాంత్. జీ 5 సంస్థ నిర్మిస్తున్న ‘మా నీళ్ళ ట్యాంక్’లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిగా సుశాంత్ నటించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత ఈ వెబ్ సీరిస్ తో తెలుగు లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది ప్రియా ఆనంద్. ‘వరుడు కావలెను’ మూవీతో దర్శకురాలిగా పరిచయం అయిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకుంది.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
వచ్చే నెల 15 నుండి ఈ వెబ్ సీరిస్ జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. బుచ్చివోలు అనే గ్రామంలోని నీళ్ళ ట్యాంక్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆ ఊరి ఎమ్మెల్యే కోదండం కొడుకు గోపాల్ నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. తాను ప్రేమించిన సురేఖను తిరిగి తీసుకొస్తే కానీ తాను ఆ ట్యాంక్ పై నుండి దిగనని బెదిరిస్తాడు. దాంతో సురేఖను తీసుకొస్తే… అతను కోరుకుంటున్నట్టు ఊరి నుండి ట్రాన్సఫర్ చేస్తానని సబ్ ఇన్ స్పెక్టర్ గిరికి హామీ ఇస్తాడు కోదండం. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కోదండం వ్యతిరేకులు ఎత్తులు మీద పై ఎత్తులు వేసి అతని పరువును మంట కలిపే పని చేస్తుంటారు. మరి సురేఖ తిరిగి ఊరు వచ్చిందా? గోపాల్ ఆమెను పెళ్ళి చేసుకున్నాడా? ట్రాన్స్ ఫర్ కోసం తపిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ గిరి ఎమ్మెల్యే కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనేదే ఈ వెబ్ సీరిస్ కథ. ఆద్యంతం వినోదభరితంగా ఇది ఉంటుందని, కథకు తగ్గట్టుగానే దీనికి ‘మా నీళ్ళ ట్యాంక్’ అనే పేరు పెట్టామని లక్ష్మీ సౌజన్య చెబుతున్నారు. సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, రామరాజు, దేవి, అన్నపూర్ణమ్మ, అప్పాజీ అంబరీశ్, బిందు చంద్రమౌళి, సందీప్ వారణాసి, లావణ్య రెడ్డి ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!