NTV Telugu Site icon

Veera Simha Reddy: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే.. చితక్కొట్టేసిన బాలయ్య

Bala

Bala

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరాసింహారెడ్డి. క్రాక్ లాంటి హిట్ సినిమా అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా వీర సింహారెడ్డి నుంచి మూడో పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. మా బావ మనోభవాలు దెబ్బ తిన్నాయే అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి ఊపు పెంచేశారు. ఈ సాంగ్ ప్రోమోలోనే స్టెప్పులతో బాలయ్య చితక్కొట్టేశాడు. చంద్రిక రవి అందాలతో సాంగ్ మొత్తం హీట్ ఎక్కించడం ఖాయమనిపిస్తోంది.

ఇక సర్ ప్రైజ్ గా ఈ సాంగ్ లో ఇంకో హీరోయిన్ హానీ రోజ్ కూడా ఆడిపాడింది. ఐటెం సాంగ్ లా అనిపిస్తున్నా ఇద్దరు హీరోయిన్స్ తో బాలయ్య మనోభావాలను పంచుకున్నట్టు కనిపిస్తున్నాడు. బాలయ్య మాస్ స్టెప్స్ కు పెట్టింది పేరు.. ఈ ఏజ్ లో కూడా ఈజ్ గా బాలయ్య డ్యాన్స్ చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. థమన్ ఈసారి ఫ్రెష్ ట్యూన్ ను అందించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రోమోతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. సాంగ్ లో ఏ రేంజ్ లో రచ్చ చేయనున్నాడో చూడాలి. ఇకపోతే ఈ సాంగ్ డిసెంబర్ 24 మధ్యాహ్నం 3.09 నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. మరి బాలకృష్ణడు మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Show comments