Site icon NTV Telugu

Dhanush : కొత్త సినిమాకు కష్టాలు… విభేదాలతో లిరిసిస్ట్ వాక్ అవుట్

Maaran

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మారన్” మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మారన్’ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో మార్చి 11న విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్మృతి వెంకట్, మాస్టర్ మహేంద్రన్, బోస్ వెంకట్, పాండా ప్రశాంత్ కూడా ఈ చిత్ర తారాగణంలో భాగం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు “మారన్”కు కష్టాలు మొదలయ్యాయి. సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, చిత్రబృందంలో విబేధాలు మొదలయ్యాయి.

Read Also : Aryan Khan Drug Case : మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

“మారన్”కి గీత రచయిత వివేక్ సహ-రచయితగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన సృజనాత్మక విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు.సోషల్ మీడియాలో వివేక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ “సృజనాత్మక విభేదాల కారణంగా నేను డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్‌గా #Maaran నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించినందుకు బృందానికి ధన్యవాదాలు. ఈ రోజు నేను భారతదేశంలోని కొన్ని అతిపెద్ద చిత్రాలలో భాగమయ్యాను. డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్‌గా.. మారన్ స్టార్టింగ్ పాయింట్ అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి” అంటూ పోస్ట్ చేశారు. దీనికి ముందు సినిమాటోగ్రాఫర్లు యామిని యజ్ఞమూర్తి, దినేష్ కృష్ణన్ వరుసగా ధనుష్ ప్రాజెక్ట్స్ ‘నానే వరువేన్’, ‘వాతి’ నుండి తప్పుకున్నారు.

Exit mobile version