Site icon NTV Telugu

Taidala Bapu: చిత్ర నిర్మాణంలోకి గేయ రచయిత తైదల బాపు

Bapu

Bapu

‘6 టీన్స్, గర్ల్‌ఫ్రెండ్‌,పటాస్, ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్‌, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్‌ శ్రీరామ్, అధినేత, సెల్ఫీరాజా’ వంటి సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు రాసిన తైదల బాపు నిర్మాత కాబోతున్నాడు. తన పాటలతో యువతను ఆకట్టుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్‌ 25 పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు.

విద్యార్థి దశ నుండే పాటలు రాయడం అలవర్చుకున్న తను ఓ టీవీ ఛానల్‌ పాటల పోటీలో విన్నర్‌గా నిలవంటంతో ఇంట్లో చెప్పకుండా 1998లో హైదరాబాద్‌కు వచ్చి జానపదంలో ఉన్న పట్టుతో వందేమాతరం శ్రీనివాస్‌కు పాటలు పాడి వినిపించడం, ఆలా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘6 టీన్స్‌’, ‘గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాలతో గేయ రచయితగా పరిచయం అవటం జరిగిందన్నారు. ఆ సినిమాలలో ‘నువ్వేడికెళ్తి ఆడికొస్తా సువర్ణా..’, ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’, ‘లష్కర్‌ బోనాల కాడ..’ వంటి సూపర్ హిట్ పాటలు తనకు మంచిపేరు తీసుకు రావడంతో వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకపోయిందన్నారు. దాదాపు 500కు పైగాపాటలు రాశానని, అలాగే పలు సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు అందుకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో రాసిన పాటలు పలువురిలో స్ఫూర్తిని రగిలించాయన్నారు. ఇక కరోనా సమయంలో మంచిర్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందించటం, ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 2022వేల మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. త్వరలో చిత్ర నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని, మంచి పాటలు రాస్తూ, ప్రేక్షకులను అలరించేలా మంచి చిత్రాలు తీయలన్నదే తన కోరిక అంటున్నాడు తైదల బాపు.

Exit mobile version