Site icon NTV Telugu

Mission – Chapter 1: నాలుగు భాషల్లో భారీఎత్తున విడుదలవుతున్న మిషన్: చాప్టర్ 1

Mission Chapter 1

Mission Chapter 1

Lyca Productions Releasing Mission Chapter 1 Worldwide In Four Languages: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్‌ భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ.. వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ త‌న‌దైన పంథాలో ఈ సంస్థ రాణిస్తోంది. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని అంశాల‌తో వైవిధ్యమైన క‌థాంశాలున్న సినిమాల‌ను ప్రేక్షకుల‌కు అందిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ.. అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ సినిమా ‘మిషన్: చాప్టర్ 1’ను ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావించిన లైకా టీమ్.. ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను ప్రక‌టించ‌నున్నారు.

Mohanlal: మోహన్‌లాల్ పచ్చి మోసగాడు.. చనిపోయేలోపే అతని బండారం బయటపెడతా

దర్శకుడు విజయ్ ఈ సినిమాను కేవలం 70 రోజుల్లోనే లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీకరించారు. 2.0 అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న నటీ ఎమీ జాక్సన్.. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తోంది. జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్రలో ఆమె క‌నిపించ‌నున్నారు. ఇందులో నిమిషా స‌జ‌య‌న్ ఓ కీల‌క పాత్ర పోషించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఒక జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో చిత్రీక‌రించిన నైట్ షాట్స్‌, డ్రామా.. ప్రేక్షకుల‌ను ఉత్కంఠపరుస్తాయి. ఇందులో హీరో అరుణ్ డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్లలో నటించడం విశేషం. దీంతో యాక్షన్ స‌న్నివేశాలు రియలిస్టిక్‌గా వ‌చ్చాయి.

Honeymoon: పెళ్లయిన కొత్త జంటల కోసం 10 బెస్ట్ హనీమూన్ స్పాట్స్

Exit mobile version