రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్ నంది వద్ద ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఉండటంతో అదే విషయం ఫిల్మ్ ఛాంబర్లో చెప్పారట.
Read Also : మహేష్ బర్త్ డే విష్… ఫ్యాన్స్ చేసి తీరాల్సిందే !
‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ అనుకున్న ఫిల్మ్ మేకర్స్ సంపత్ నందిని అప్రోచ్ అయ్యారు. ఆయన మెగా స్టార్ మూవీ కోసం తాను రిజిస్టర్ చేయించిన టైటిల్ వదులుకోటానికి సంతోషంగా ఒప్పుకున్నాడట. మరి కొద్ది రోజుల్లోనే చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం టైటిల్ పై ఎలాంటి క్లారిటీ లేదు. చిరంజీవి సినిమాకి రామ్ చరణ్ దర్శకుడి టైటిల్ ఫైనలైజ్ అవుతుందో లేదో… చూడాలి మరి!
