NTV Telugu Site icon

Inaya: ‘లవ్ టుడే’ భామకు ఆ టాలీవుడ్ హీరో అంటే మోజు అంట

Inaya

Inaya

Inaya: లవ్ టుడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త బ్యూటీ అలీనా షాజీ ఇవానా. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొత్త క్రష్ గా మారిపోయింది. తమిళ్, మలయాళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకొంటుంది అనేది అందరికి తెల్సిందే. ఇక ఈ ముద్దుగుమ్మను తెలుగువారు అస్సలు వదిలిపెట్టడం లేదు అంటే అతిశయోక్తి కాదు. లవ్ టుడే సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యి హిట్ అందుకున్నదో ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూలే కనిపిస్తున్నాయి.

ఇక తాజాగా ఈ భామ తన టాలీవుడ్ క్రష్ ఎవరో చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో మీకు నచ్చిన హీరో ఎవరు..? ఎవరితో పనిచేయాలనుకుంటున్నారు..? అని అడుగగా.. “నేను మొదటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూనే ఉంటాను.. హ్యాపీ డేస్ నుంచి జాతి రత్నాలు వరకు అన్ని సినిమాలు చూశాను. ఇక నా ఫేవరేట్ హీరో అంటే ఇకను స్టార్ అల్లు అర్జున్. ఆయన నటన అన్నా, డ్యాన్స్ అన్నా పది చచ్చిపోతాను. అవకాశం వస్తే ఆయనతో నటించాలని ఉంది”అని చెప్పుకొచ్చింది. బన్నీకి కేరళలో ఫ్యాన్ బేస్ ఎలా అంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ భామ కోరిక త్వరలో ఏమైనా నెరవేరుతుందేమో చూడాలి.