NTV Telugu Site icon

Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..

Love Me

Love Me

Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది. ఫస్ట్ లుక్ లోనే దెయ్యంతో ప్రేమలో పడే యువకుడు అని తెలియగానే ఇదేదో కొత్త కాన్సెప్ట్ గా అనిపిస్తుందే అని ప్రేక్షకులు అనుకున్నారు. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దెయ్యాన్ని ప్రేమించి, ఆమెతో రొమాన్స్ చేయాలనుకొనే ఒక యువకుడు కథే ఈ సినిమా.

” భయమేసే చోట రొమాన్స్.. ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది పిల్ల” అని ఆశిష్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది. ఒక అడివి.. దాని మధ్యలో ఒక పాడుబడిన బంగ్లా.. అందులో ఒక ఆడ దెయ్యం. ఆ బంగ్లాకు వెళ్లిన వారెవ్వరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న ఆశిష్, వైష్ణవి.. ఆ బంగ్లాకు వెళ్తారు. అక్కడ ఆశిష్.. ఆ దెయ్యంతో ప్రేమలో పడి రొమాన్స్ చేయాలనీ చూస్తాడు. అతడికి పిచ్చి పట్టిందని వైష్ణవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక దెయ్యంతో ఆశిష్ ఫ్లర్ట్ చేయడం మొదలుపెడతాడు. కాఫీకి రమ్మని కోరతాడు. మరి ఆశిష్ ఫ్లర్టింగ్ కు దెయ్యం ప్రేమలో పడిందా.. ? అసలు దివ్యావతి ఎవరు.. ? ఎందుకు దెయ్యంగా మారింది.. ? చివరకు ఆశిష్ అనుకున్నది సాధించాడా.. ? అనేది చూడాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటివరకు హీరోయిన్ చచ్చిపోయాక.. ప్రేమించిన హీరో వెనుక పడడం చూసాం.. కానీ, మొదటిసారి ఒక దెయ్యాన్ని.. హీరో ప్రేమించడం చూపిస్తున్నారు. ఇక కీరవాణి మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ టీజర్ చూసాక అభిమానులంతా.. పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా .. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.