Site icon NTV Telugu

Coolie : సోషల్ మీడియాకు దూరంగా లోకేష్ కనగరాజ్.. కారణం ఏంటంటే.?

Lokesh

Lokesh

రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో అభిమానులకు షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్.

Also Read : AJITH : గుడ్ బ్యాడ్ అగ్లీ.. తమిళనాట సెన్సేషనల్ వసూళ్లు

సోషల్ మీడియాకు స్మాల్ బ్రేక్ ఇస్తున్నట్లు ఎనౌన్స్ చేసి మూవీ లవర్స్‌ను బాధపెట్టాడు లోకేశ్. జస్ట్ కూలీ ప్రమోషన్ల వరకు సామాజిక మాధ్యమాల్లో  ప్రమోషన్స్ చేయను అని తెలిపాడు. అభిమానులు కాస్తంత నిరాశకు గురైనా సినిమా కోసమే ఇదంతా చేస్తున్నాడని భావిస్తున్నారు. రీసెంట్లీ లోకేశ్ కూడా ట్రోలర్స్ బారిన పడ్డాడు. లోకీ పస్ట్ మూవీ మానగరం హీరో శ్రీ నటరాజన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోవా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో లోకేశ్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలనుకోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాగే కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా జరిగాడు. లియో షూటింగ్ టైమ్‌లో కూడా సామాజిక మాధ్యమాలను ఎవైడ్ చేశాడు. అలా ఫుల్‌గా సినిమాపై కాన్సంట్రేషన్ చేస్తే బొమ్మ ఎంతటి హిట్ కొట్టిందో తెలుసు. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నట్లున్నాడు. ఈ లెక్కన చూస్తే కూలీ సరికొత్త రికార్డులు తిరగరాసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టార్ ఫిల్మ్ మేకర్.

Exit mobile version