NTV Telugu Site icon

Lokesh Kanagaraj: శృతి హాసన్‌తో లోకేష్ రొమాన్స్.. ఈ రేంజ్ లో అసలు ఊహించనేలేదే!

Lokesh Kanagaraj Shruti Romance

Lokesh Kanagaraj Shruti Romance

lokesh kanagaraj shruti haasan starring album song inimel Promo Goes Viral: దర్శకుడిగా తమిళ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ సంగీతం అందించారు. ఈ ప్రోమోలో చూస్తే శ్రుతి-లోకేష్ కనగరాజ్ ల కెమిస్ట్రీ బెస్ట్ గా ఉంది. ప్రేమికుల మధ్య జరిగే ఇనిమెల్ సాంగ్ ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటి వరకు కేవలం డైరెక్షన్‌పైనే దృష్టి పెట్టిన లోకేష్ కనరాజ్ ఈ ఆల్బమ్ సాంగ్‌లో శృతి హాసన్‌కి జోడీగా నటించాడు. నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు.

Naslen Gafoor: మహేష్ బాబు,ప్రభాస్ సరసన మలయాళ కుర్ర హీరో..

అంతలా వీరిద్దరి కెమిస్ట్రీ కనిపిస్తోంది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ మార్చి 25న ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా పాట టీజర్‌ను కమల్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తన సినిమాలో కూడా రొమాన్స్ సీన్స్ ఎక్కవగా పెట్టని లోకేష్ ఈ ఆల్బమ్ సాంగ్ లో శృతితో రొమాన్స్ మాత్రం ఇరగదీశాడు. దీంతో ఇప్పుడు ఫుల్ ఆల్బమ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా ప్రభాస్ నటించిన సాలార్ చిత్రంలో కథానాయికగా నటించడం గమనార్హం. శృతి హాసన్ నటి మాత్రమే కాదు, గాయని అలాగే సంగీత స్వరకర్త కూడా. ఈ సందర్భంలో, కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఆల్బమ్ సాంగ్ ఇనిమెల్‌కు శృతి హాసన్ సంగీతం అందించారు. ఇక మరోపక్క లోకేష్ కనగరాజ్ ఇప్పటికే మాస్టర్, సింగపూర్ సలోన్ వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆల్బమ్ లిరిక్స్ ను నటుడు కమల్ హాసన్ రాశారని ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు టీజర్ ను విడుదల చేసి ఈ ఆల్బమ్ సాంగ్ ను మార్చి 25న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.