Site icon NTV Telugu

Coolie : ఆల్ టైమ్ రికార్డ్ ధరకు ‘కూలీ’ తెలుగు రైట్స్..

Coolie

Coolie

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తుంది.

కాగా కూలీ తెలుగు రాష్ట్రాల హక్కుల థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ కు చెందిన నాలుగురు ప్రముఖ నిర్మాతలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడ్డారు. సితార సంస్థ నాగవంశీ కూలీ రైట్స్ కోసం సుమారు రూ. 40 కోట్ల మేర కోట్ చేసారు. అదే టైమ్ లో ఏషియన్ సురేష్ సినిమాస్ సంస్థ కూడా గేమ్ లోకి ఎంటర్ అయింది. దాంతో సన్ పిచర్స్ బేరాలు మొదలు పెట్టింది. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అనేలా వ్యవహరించింది. అనేక బేరసారాల అనంతరం కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ పాటు దిల్ రాజు భాగస్వామ్యంగా అత్యంత భారీ ధరకు రూ. 44 కోట్లతో పాటు  జిఎస్టి ఇచ్చేలా కొనుగోలు చేసింది. దాంతో డబ్బింగ్ సినిమాలలో భారీ ధర పలికి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాగా కూలీ నిలిచింది. రూ. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version