Site icon NTV Telugu

Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు రజినీకాంత్. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. 2023 కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన జైలర్ సినిమా దెబ్బకి తమిళ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి.

  1. కర్ణాటకాలో 11 కోట్లకి పైగా రాబట్టి జైలర్ టాప్ ప్లేస్ లో చేరింది. ఒక తమిళ డబ్బింగ్ సినిమాకి కర్ణాటక స్టేట్ లో ఈ రేంజ్ ఓపెనింగ్ ఇదే మొదటిసారి.
  2. 2023లో పొన్నియిన్ సెల్వన్ 2 కోలీవుడ్ టాప్ డే 1 గ్రాసర్ గా ఉంది. ఆ రికార్డుని జైలర్ బ్రేక్ చేసి తమిళనాడులో 2023 డే 1 టాప్ గ్రాసర్ గా నిలిచింది.
  3. కేవలం 2023లోనే ఓవరాల్ గా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా జైలర్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో రోబో 2.0, సెకండ్ ప్లేస్ లో కబాలి సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ బాక్సాఫీస్ డే 1 రికార్డ్స్ టాప్ 3 సినిమాలు రజినీవే కావడం విశేషం.
  4. ఈ ఏడాది ఇండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాల ఓపెనింగ్ డే అమెరికా కలెక్షన్స్ ని జైలర్ బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈరోజు ఎండ్ అయ్యే సరికి జైలర్ 2 మిలియన్ డాలర్స్ ని టచ్ చేయనుంది.
  5. అమెరికాలోనే కాదు వరల్డ్ వైడ్ గా డే 1 ఓవర్సీస్ కలెక్షన్స్ విషయంలో తమిళ సినిమాలన్నింటికన్నా జైలర్ అత్యధికంగా రాబట్టింది.
  6. 2023లో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమాల్లో తెలుగు, కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియాల్లో జైలర్ అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టి టాప్ ప్లేస్ లో సొంతం చేసుకుంది.

ఇవి రజినీ దెబ్బకి క్రియేట్ అయిన రికార్డ్స్, ఈ వీక్ ఎండ్ అయ్యే సమయానికి జైలర్ మరిన్ని రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Exit mobile version