Site icon NTV Telugu

This Week Releases: ఈ వారం థియేటర్స్ లోకి రానున్న సినిమాలివే…

This Week Movies

This Week Movies

జనవరి 12 నుంచి 14 వరకు నాలుగు సినిమాలు రిలీజై 2024 సంక్రాంతిని స్పెషల్ గా మార్చాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించే… అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు 2024 సంక్రాంతికే కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగులో ఎక్కువ సినిమాల రిలీజ్ ఉండడంతో మేకర్స్ ఈ సినిమాల తెలుగు విడుదల వరకు హోల్డ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాల్లో మిల్లర్ జనవరి 25న వస్తుండగా శివ కార్తికేయన్ జనవరి 26న ఆడియన్స్ ముందుకి రానున్నాడు. కోలీవుడ్ లో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాయి అనేది చూడాలి.

ఈ డబ్బింగ్ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతూ ఉండగా… పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ కూడా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హ్రితిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా కూడా ఉంది. ఫైటర్ సినిమా జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్, ఓవర్సీస్, తెలుగు ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్ లో ఫైటర్ సినిమా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండనుంది. ఫైటర్ రిలీజ్ అవుతున్న రోజే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలైకోట వాలీబన్ కూడా థియేటర్స్ లోకి రానుంది. మలయాళ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి. ఇక హీరోయిన్ హన్సిక నటిస్తున్న ఎక్స్పరిమెంటల్ మూవీ 105 మినిట్స్‌ జనవరి 26న రిలీజ్ కానుంది. హన్సిక ప్రధాన పాత్ర పోషించగా… రాజు దుస్సా దర్శకత్వం వహించారు. వీటితోపాటు మూడో కన్ను, బిఫోర్‌ మ్యారేజ్‌, ప్రేమలో.., రామ్‌: రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌, చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Exit mobile version