ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంత చర్చ ఇండియా మొదటిసారి జరుగుతుంది. దానికి కారణం మన దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే. వెస్ట్ లో మేజర్ అవార్డ్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంటూ ఉండడంతో మన ఆడియన్స్ కి ఆస్కార్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతోంది. 2023లో జరగనున్న ఆస్కార్స్ వేడుకకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో అవార్డ్ తీసుకోవడానికి అర్హత సాదించిన కొన్ని సినిమాలని షార్ట్ లిస్టు చేసి అనౌన్స్ చేశారు. ఇందులో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో షార్ట్ లిస్ట్ అయ్యింది. దీంతో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఒక కేటగిరిలో ఆస్కార్ వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయి. మిగిలిన కేటగిరిల్లో షార్ట్ లిస్ట్ అయిన సినిమాల వివరాలు తెలియాల్సి ఉంది.
‘ఆర్ ఆర్ ఆర్’తో పాటు మరో మూడు సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్స్ కి వెళ్లిన గుజరాతీ సినిమా ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ షార్ట్ లిస్ట్ అవ్వడం గర్వించదగ్గ విషయం. బెస్ట్ డాకుమెంటరీ కేటగిరిలో ‘ఆల్ దట్ బ్రీత్స్’ అనే ఇండియా డాకుమెంటరీ షార్ట్ లిస్ట్ అయ్యింది. డాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ కేటగిరిలో ‘ది ఎలిఫాంట్ విస్పర్స్’ షార్ట్ లిస్ట్ అయ్యింది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో పాటు ఇండియా నుంచి షార్ట్ ;లిస్ట్ అయిన మిగిలిన మూడు ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ నామినేషన్స్ లో ఉండాలని ప్రతి భారతీయ సినిమా అభిమాని కోరుకుంటున్నాడు. మరి వీటిలో ‘ఆస్కార్’ని ఇండియాకి తెచ్చే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.