NTV Telugu Site icon

Sharukh: టికెట్ రేట్ తగ్గిస్తూ పఠాన్ మాస్టర్ ప్లాన్… ఒకేసారి రెండు సినిమాలకి చెక్

Sharukh Khan

Sharukh Khan

కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్ హీరోగా జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. ఈ వీకెండ్ లోపు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవం తెస్తుంది. బాయ్కాట్ ట్రెండ్ కారణంగా క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ ని షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రివైవ్ చేసేసాడు. మూడు వారాలుగా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న షారుఖ్ అండ్ యష్ రాజ్ ఫిల్మ్స్ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశాయి. హిందిలో పఠాన్ సినిమా 500 కోట్లు రాబట్టి, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో ఉంది. పఠాన్ కన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 సినిమా ఉంది. ఈ మూవీ 511 కోట్లని రాబట్టి 2017 నుంచి టాప్ ప్లేస్ లో ఉంది. పఠాన్ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యాలి అంటే ఈ వీకెండ్ వరకూ థియేటర్స్ ని హోల్డ్ చెయ్యాలి.

హిందీలో కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా సినిమా ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకి రానుంది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే పఠాన్ మూవీ బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడం కష్టం అవుతుంది. ఈ విషయం అర్ధం చేసుకోని మేకర్స్ #PathaanDay ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఫ్రైడే పఠాన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఇండియాలోని ప్రతి పఠాన్ సినిమా ఆడే థియేటర్ లో టికెట్ ప్రైజ్ ని 110/- చేశారు. ఈ ఫ్రైడే మాత్రమే పఠాన్ సినిమాని 110/- రూపాయలకి చూసే ఛాన్స్ ఇస్తూ మేకర్స్ పఠాన్ సినిమాని సెలబ్రేట్ చేసుకోండి అని అనౌన్స్ చేశారు. దీంతో సినిమా లవర్స్ ఫిబ్రవరి 17న పఠాన్ సినిమా చూడడానికి రెడీ అవుతున్నారు. ఈ కారణంగా షెహజాదా సినిమాకి ఓపెనింగ్స్ తగ్గుతాయి, బాహుబలి 2 రికార్డ్స్ కూడా హ్యుజ్ మార్జిన్ తో బ్రేక్ అవుతాయి. అంటే ఒక్క దెబ్బకి రెండు సినిమాలు అవుట్ అనమాట. ఫిబ్రవరి 18న ‘మహా శివరాత్రి’ ఫెస్టివల్ కూడా ఉండడంతో పఠాన్ మూవీకి లాంగ్ వీకెండ్ దొరికింది. ఈ లాంగ్ హాలిడేని క్యాష్ చేసుకుంటే పఠాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యుజ్ బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది.