NTV Telugu Site icon

Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…

Nani

Nani

ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్ రేపు సాయంత్రం 4:05 నిమిషాలకి బయటకి రానున్నాయి. నాని సినిమాలో హార్ట్ బ్రేక్ సాంగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. నిన్ను కోరి సినిమాలో ‘ఉమా గాడి లైఫ్’ అనే సాంగ్ బ్రేక్ ఏంథమ్ గా మిగిలిపోయింది.

Read Also: Priyanka Chopra: ప్రేమికుల రోజున ప్రియాంక ఏం చేయబోతోంది!?

ఇప్పుడు దసరా మూవీ నుంచి వచ్చే సాంగ్ కూడా అదే రేంజులో ఉంటుందేమో చూడాలి. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్న దసరా మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఆల్బమ్ నుంచి ‘దోస్తాన్’ సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా దసరా టీజర్ కూడా రిలీజ్ అయ్యి, పాన్ ఇండియాని షేక్ చేసింది. సౌత్ నుంచి మరో భారి సినిమా రాబోతుందని నార్త్ వాళ్లు కూడా ఫీల్ అయ్యే రెంజులో దసరా టీజర్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న హైప్ ని ఇలానే మైంటైన్ చేస్తూ పోతే నాని ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ.

Show comments