NTV Telugu Site icon

లతా మంగేష్కర్ గురించి ఈ విషయాలు తెలుసా ?

latha mangeshkar

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్‌లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం.

Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం

  1. శేవంతి, దినతన్ మంగేష్కర్‌లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే, ఉష, మీనా, హృదయనాథ్ ఉన్నారు.
  2. లతా తల్లి ఆమె తండ్రికి రెండవ భార్య. దీనానాథ్ మొదటి భార్య లత అత్త. ఆమె వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే మరణించింది.
  3. లత పుట్టినప్పుడు ఆమెకు హేమ అని పేరు పెట్టారు. తన తండ్రి నాటకాలలో లతిక అనే పాత్ర ప్రేరణతో ఆమె పేరు లతగా మార్చారు.
  4. దీనానాథ్ థియేటర్ ఆర్టిస్ట్, శాస్త్రీయ గాయకుడు. అందుకే లత చిన్నప్పటి నుండే సంగీతానికి అలవాటు పడింది. తన ఐదేళ్ల వయసులో ఆమె తన తండ్రి నాటకంలో కూడా పాత్ర పోషించింది.
  5. తన తండ్రి మరణానంతరం, లత కుటుంబానికి ఏకైక ఆధారం అయింది. ఆమె పాడిన మొదటి పాట మరాఠీ చిత్రం ‘కితి హసల్’. ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా విడుదల కాలేదు.
  6. లతా తన జీవితంలో మొదటి 16 సంవత్సరాలు ఆమె జన్మించిన ఇండోర్‌ లోనే నివసించింది. ఆమె పుట్టిన ఇల్లు ఇప్పుడు ఒక బట్టల షోరూమ్.
  7. లత 1942-1948 సంవత్సరాల మధ్య ఎనిమిది చిత్రాలలో నటించారు. ఆమె ‘ఆనందఘన్’ అనే మారు పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించింది.
  8. లతా మంగేష్కర్ సంగీత దర్శకుడు గులాం హైదర్‌ని తన గాడ్‌ఫాదర్‌గా అభివర్ణించారు.
  9. ప్రతిష్టాత్మకమైన లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారిణి లత.
  10. ఆమెకు ఇష్టమైన క్రీడ క్రికెట్‌ను ఆస్వాదించడానికి లార్డ్స్ స్టేడియంలో లతాకు శాశ్వత గ్యాలరీ ఉంది.
  11. 1963 జనవరి 27న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాటను ప్రదర్శించినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు.