‘ది మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ అని మ్యూజిక్ ప్రియులు లవర్స్ పిలుచుకునే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి నేటితో 55 ఏళ్లు. ఆయన తన మనోహరమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించారు. భారత ప్రభుత్వం ఆయన చిత్రపరిశ్రమకు చేసిన కృషికి గానూ దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందించి గౌరవించింది. రెహమాన్ అందుకున్న అవార్డులలో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక BAFTA అవార్డు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, పదిహేను ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. అంతేకాదు పదిహేడు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇంతగా ప్రసిద్ధి చెందిన ఈ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయాలెన్నో… ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మన మ్యూజిక్ మాస్ట్రో, సింగర్, కంపోజర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Read Also : వివాదంలో ‘ఆచార్య”… పోలీసులకు ఆర్ఎంపీ డాక్టర్ల ఫిర్యాదు
- రెహమాన్ పుట్టుకతో ముస్లిం కాదు. ఆయన హిందూ కుటుంబంలో జంపించారు. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. 23 సంవత్సరాల వయస్సులో ఈ సంగీత స్వరకర్త తన ఆధ్యాత్మిక గురువు ఖాద్రీని కలుసుకున్న తర్వాత ఇస్లాంను స్వీకరించారు.
- ఆయన చిన్నప్పుడే దూరదర్శన్ లో ప్రసారమైన ‘వండర్ బెలూన్’లో కనిపించాడు. అందులో రెహమాన్ ఒకేసారి 4 కీబోర్డులు ప్లే చేయగల పిల్లవాడిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది రెహమాన్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందే జరిగింది.
- రెహమాన్‌లోని ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి మణిరత్నం. 1992లో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘రోజా’ కోసం మ్యూజిక్ అందించాల్సిందిగా కోరుతూ రెహమాన్ కి మొదటి అవకాశం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ రూ. 25,000 పారితోషికంగా అందుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ హిట్ అవ్వడంతోనే జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయ్యాడు.
- రెహమాన్ సైరాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు… అమీన్ ఖతీజా, రహీమా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెహమాన్ కుమారుడు అమీన్ కూడా తండ్రి పుట్టినరోజునే పుట్టాడు. అంటే జనవరి 6న.
- ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా మ్యూజిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సంగీతం ఎల్లలుదాటి అమెరికాలో కూడా మారుమ్రోగింది. ఈ సినిమాకు గానూ ఒకే సంవత్సరంలో 2 ఆస్కార్‌లను గెలుచుకున్న మొదటి ఆసియా వ్యక్తి ఏఆర్ రెహమాన్. పద్మభూషణ్, పద్మశ్రీ గ్రహీత, 4 జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు.
- ఆస్కార్ విన్నింగ్ పాట “జై హో” మొదట్లో సల్మాన్ ఖాన్ నటించిన ‘యువరాజ్’ కోసం కంపోజ్ చేశారని చాలామందికి తెలియదు!
- ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో పాటు ‘127 అవర్స్ ‘, ‘లార్డ్ ఆఫ్ వార్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు కూడా రెహమాన్ అద్భుతమైన స్కోర్‌లను అందించారు.
- రెహమాన్ మిక్ జాగర్, డేవ్ స్టీవర్ట్, జాస్ స్టోన్‌లతో కలిసి సూపర్ హెవీ పేరుతో పూర్తిగా భిన్నమైన సంగీతాన్ని పరిచయం చేశారు.
- సింగర్, కంపోజర్‌ను గౌరవించడం కోసం కెనడాలోని ఒంటారియోలోని మార్ఖమ్‌లోని ఒక వీధికి నవంబర్ 2013లో రెహమాన్ పేరు పెట్టారు.
- రెహమాన్ స్వరపరిచిన ఎయిర్‌టెల్ సిగ్నేచర్ ట్యూన్ 150 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన మొబైల్ మ్యూజిక్‌గా నిలిచింది.