వివాదంలో ‘ఆచార్య’… పోలీసులకు ఆర్ఎంపీ డాక్టర్ల ఫిర్యాదు

మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం విడుదలైన ‘ఆచార్య’ ఐటెం సాంగ్ ‘శానా కష్టం’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు అదే సాంగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు మేకర్స్.

Read Also : పాపులర్ స్టాండ్ అప్ కమెడియన్ కు షాక్…. మునావర్ ఫారూఖీ షో రద్దు

తాజాగా ‘ఆచార్య’ పాటపై ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే… ‘ఆచార్య’ చిత్ర యూనిట్ తాజాగా “శానా కష్టం” అనే ఐటెం నంబర్‌ను విడుదల చేసింది. మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయింది. భాస్కరబట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను రేవంత్, గీతా మాధురి ఆలపించారు. ఈ పాటలో మెగా స్టార్‌తో పాటు రెజీనా కసాండ్రా చిందేసింది. అయితే ఈ పాటలో “ఏడేడో నిమరోచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే” అనే లిరిక్ ఉంది. అంటే యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్ అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందా లిరిక్. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు పాటలోని ఈ వాక్యాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఈ పాట తమ వృత్తిని అవమానించేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ, జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత, దర్శకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Articles

Latest Articles