NTV Telugu Site icon

Leo Producer: ఈ సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు…

Leo Producer

Leo Producer

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ రేంజ్ సినిమా కాదు, మాస్టర్ తర్వాత కూడా హిట్ కొట్టలేదు, అనవసరంగా LCUతో కలిపారు, విజయ్-లోకేష్ ఖాతాలో హిట్ అనేది పడదేమో, సెకండ్ హాఫ్ అసలు లోకేష్ డైరెక్ట్ చేశాడా, అతను అసలు పార్తీబన్ అయితే ఏంటి కాకపోతే ఏంటి, లియో దాస్ విజయ్ యే అని ఒప్పుకోవడానికి అంత సినిమా చేయాలా… ఇలా రకరకాలా కామెంట్స్ లియో సినిమాపై వినిపిస్తున్నాయి. ఎన్ని కామెంట్స్ వినిపించినా లియో సినిమా మొదటి రోజు 148 కోట్లు రాబట్టి 2023 హయ్యెస్ట్ డే 1 గ్రాసర్ గా నిలిచిందని ప్రొడ్యూసర్ లలిత్ అనౌన్స్ చేసాడు. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా లియో సినిమా 200 కోట్లని రాబట్టింది ప్రొడ్యూసర్ చెప్తున్న ఫిగర్స్. ఈ మూవీ రజినీకాంత్ జైలర్ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుంది, వెయ్యి కోట్లని రాబడుతుంది అంటూ విజయ్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ విషయంలో లలిత్ కుమార్ మాటలు ఇంకోలా ఉన్నాయి. లియో సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు అంటూ కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పాడు లలిత్ కుమార్. “హిందీ బెల్ట్ నుంచి లియో సినిమా కలెక్షన్స్ ని పెద్దగా కాంట్రిబ్యూషన్ లేదు. ఈ కారణంగా లియో సినిమా వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వదు. దాదాపు రెండు లక్షల మంది లియో సినిమాని మొదటి రోజు చూడడానికి తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లారు. వాళ్లకి ఇబ్బంది కలగకుండా ఇక్కడే షో వేయాలనే ప్రయత్నం చేశాను. అందుకే తమిళనాడు ప్రభుత్వాన్ని 4 గంటలకి, 7 గంటలకి స్పెషల్ షో పర్మిషన్ అడిగాను కానీ వాళ్లు ఇవ్వలేదు” అంటూ లలిత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. లలిత్ కుమార్ చెప్పిన మాటలు, లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి. సెకండ్ డే లియో కలెక్షన్స్ లో వచ్చిన డ్రాప్ లో చూస్తే వెయ్యి కోట్లు అనేది లియో సినిమాకి అసలు అందుబాటులో లేని విషయంగా కనిపిస్తోంది. మరి లియో సినిమా కలెక్షన్స్ నైనా టార్గెట్ చేస్తుందేమో చూడాలి.