Leo: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ సినిమా కోర్టు మెట్లెక్కింది. తెలుగులో లియో టైటిల్ ను మరొకరు రిజిస్టర్ చేసుకోవడం.. వారు.. నాగవంశీ దగ్గరకు వెళ్లకుండా కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం వేరే లెవెల్ కు వెళ్ళింది. ఇక తాజాగా ఈ వివాదంపై నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.
Kriti Sanon: ప్రభాస్ ను వదిలి బన్నీపై కన్నువేశావా.. పాప
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ మధ్య తమిళ్, మలయాళ సినిమాలు.. ఒరిజినల్ పేర్లు ఏమైతే ఉన్నాయో వాటినే తెలుగులో కూడా పెడుతున్నారు. దీనివలన టైటిల్ అర్థంకాక చాలామంది సినిమాకు వెళ్లడం లేదు. అంతేకాకుండా తెలుగు, తమిళ్ లో సినిమా రిలీజ్ చేస్తుంటే.. ఎక్కువగా తమిళ్ వాసనలే కనిపిస్తున్నాయి. దీనివలన కూడా తెలుగువారు సినిమా చూడడానికి ఇష్టపడడం లేదు. విజయ్ నటించిన వారసుడు సినిమా తీసుకుంటే.. ఆ సినిమాలో కూడా ఎక్కువ తమిళ్ వాసనలే ఉంటాయి. అప్పుడు విజయ్ సైతం.. ఇది తెలుగు సినిమా కాదని, తమిళ్ డబ్బింగ్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు లియో కూడా అలానే వస్తే.. ఇది కూడా వారసుడు రిజల్ట్ ను అందుకోవడమే అని అభిమానులు జోస్యం చెప్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే.. అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఆ నేటివిటీకి తగ్గట్టు ఉంటేనే అభిమానులకు సినిమా కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నది లోకేష్ కనగరాజ్ కాబట్టి.. ఆయన తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ తెలుగులో కూడా హిట్స్ అందుకోవడంతో.. ఈసారి లియో హిట్ కొట్టే ఛాన్స్ లు కూడా లేకపోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.