లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. కేవలం అయిదు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి ఇండియా లెవల్ క్రేజ్ రావడం చిన్న విషయం కాదు. అలాంటి అఛీవ్మెంట్ కి లోకేష్ కనగరాజ్ అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ నుంచి అక్టోబర్ 19న లియో సినిమా రానుంది. దళపతి విజయ్ లుక్స్ ని లోకేష్ పూర్తిగా మార్చి సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో ఎదో కొత్తగా ట్రై చేసాడు. ఈ సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా బజ్ జనరేట్ అవ్వట్లేదు. అన్నౌన్స్మెంట్ సమయంలో ఉన్న బజ్ ఇప్పుడు లేదు దీనికి కారణం జనాల్లో లియో సినిమా రీమేక్ అనే ముద్ర పడిపోవడమే.
లియో సినిమా 2005లో వచ్చిన హాలీవుడ్ మూవీ “ది హిస్టరీ ఆఫ్ వయొలెన్స్” సినిమాకి రీమేక్ అనే మాట లియో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ ప్లాట్ పాయింట్, లియో ప్లాట్ పాయింట్ ఒకటే అవ్వడంతో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా సేమ్ ఉండడంతో లియో రీమేక్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. లేటెస్ట్ గా వచ్చిన లియో ట్రైలర్ లోని షాట్స్ కూడా “ది హిస్టరీ ఆఫ్ వయొలెన్స్” సినిమాలోని షాట్స్ ని పోలి ఉంది. దీంతో లియో రీమేక్ అని డిసైడ్ అయిపోయారు. నిజానికి “ది హిస్టరీ ఆఫ్ వయొలెన్స్” సినిమానే అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా తెరకెక్కింది. లోకేష్ ఆ బుక్ రైట్స్ ని సొంతం చేసుకోని లియో సినిమాని తెరక్కిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. తనకంటూ ఒక సెపరేట్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడి నుంచి రీమేక్, అడాప్షన్ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే లియో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయినా కూడా బజ్ జనరేట్ అవ్వట్లేదు. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి లియో సినిమాలో లోకేష్ అద్భుతాలు చూపిస్తేనే ఈ మూవీ హిట్ అవుతుంది లేదంటే మరో మాస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
