NTV Telugu Site icon

Leo Telugu Poster: అప్పుడు బ్లడీ స్వీట్ చూపించి.. ఇప్పుడు యుద్ధం వద్దంటారేంటండీ..

Vijay

Vijay

Leo Telugu Poster: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం లియో. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తుంది. పరాజయం అందుకొని డైరెక్టర్ గా లోకేష్ కు మంచి పేరు ఉంది. అందులోనూ విక్రమ్ లాంటి హిట్ సినిమా తర్వాత లోకేష్.. లియో సినిమా చేయడంతో ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే విజయ్- లోకేష్ కాంబోలో మాస్టర్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నా రెడీనా సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Siraj: సిరాజ్ సంచలనం.. ప్రశంసించిన రాజమౌళి

ఇక తాజాగా లియో సినిమా తెలుగు పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్లో విజయ్ చాలా కూల్ గా కనిపించాడు. కూల్ గా నిలబడిన విజయ్ లుక్ మధ్యలో మంచుతో కప్పబడిన చెట్ల మధ్య విజయ్ పరిగెత్తుకుంటూ వస్తున్న పోస్టర్ ను చూపించారు. ఇక ఈ పోస్టర్ కు ” కీప్ కామ్ అండ్ అవాయిడ్ ద బాటిల్” అంటూ ఒక కొటేషన్ను కూడా యాడ్ చేశారు అంటే యుద్ధాన్ని నివారించి ప్రశాంతంగా ఉండమని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే లియో ఫస్ట్ గ్లింప్స్ లో బ్లడీ స్వీట్ అని రక్తాన్ని చూపించి.. ఇప్పుడు పోస్టర్ లో కామ్ గా ఉండమని చెప్తారేంటండీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారిం.ది మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments