Siraj: సిరాజ్ సంచలనం.. ప్రశంసించిన రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siraj: ఆసియా కప్-2023 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఇందులో సిరాజ్ మియన్ ఆటకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. ఒక్క ఓవర్ లోనే నాలుగు వికెట్స్ తీసి దుమ్ములేపిన సిరాజ్… 12 ఓవర్లులో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో ఇండియా మొత్తం సిరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సిరాజ్ ట్రెండింగ్ లో నిలిచాడు.
IND vs SL: వన్డే చరిత్రలో సిరాజ్ అరుదైన రికార్డు
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
సిరాజ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అతడి ఆటను ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సిరాజ్ సంచలనంపై ట్వీట్ చేశాడు. సిరాజ్ ఆడిన ఆట తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు.. ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లతో మెరిశాడు. అంతేకాకుండా తన సొంత బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్‌కు పరిగెత్తుతున్న పెద్ద హృదయాన్ని కలిగి ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక జక్కన్న ట్వీట్ పై క్రికెట్ అభిమానులు సైతం రిప్లై ఇస్తూ.. అవును .. మీరు చెప్పింది నిజమే.. సిరాజ్ మంచి ప్లేయర్ అని చెప్పుకొస్తున్నారు.
Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻
And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗— rajamouli ss (@ssrajamouli) September 17, 2023
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!