Site icon NTV Telugu

Leo Movie: వివాదాలను పట్టించుకోకుండా ఎట్టకేలకు ఆ పని కానిచ్చేశారు..

Leo

Leo

Leo Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక మరోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం లియో. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Anasuya: అన్నను తిట్టి.. తమ్ముడిని పొగిడేస్తున్నావ్.. ఏంటి కథ..?

ముఖ్యంగా నా రెడీనా సాంగ్ ఏంటది వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించాడని, అలా చేసి యువతను చెడుమార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నాడని కొన్ని సంఘాలు కోర్టులో కేసు వేసాయి. విజయ్ ను, లోకేష్ ను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసాయి. అయితే ఈ కేసు గురించి చిత్ర బృందం ఇప్పటివరకు నోరువిప్పింది లేదు. ఇక ఆ వివాదాలనేం పట్టించుకోకుండా లోకేష్- విజయ్.. ఎట్టకేలకు లియో షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు. విజయ్- లోకేష్ చెయ్యి కలుపుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. లియో షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలిపారు. ఇక మరికొద్దిరోజుల్లో ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టనుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version