Site icon NTV Telugu

Leo: మళ్లీ భారీ తప్పు చేస్తున్న లోకేష్… పోస్టరే ప్రూఫ్

Leo

Leo

ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఖైదీతో లింక్ చేయడమే. ఇకపై తన నుంచి వచ్చే సినిమాల్లో ‘యూనివర్స్’లో భాగంగా రిలీజ్ అయితే వాటికి, టైటిల్ పోస్టర్ లో ‘LCU’ అని మెన్షన్ చేస్తానని లోకేష్ కనగరాజ్ ఇప్పటికే క్లియర్ కట్ గా చెప్పేసాడు. ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న ‘లియో’ సినిమా కూడా LCUలో భాగంగా ఉంటుందేమో అని సినీ అభిమానులంతా టైటిల్ పోస్టర్ కోసం వెయిట్ చేసారు. విజయ్ బర్త్ డే కావడంతో లియో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు, ఇందులో ‘LCU’ మాటే లేదు అంటే లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కట్లేదు. మాస్టర్ సినిమా స్టైల్ లోనే స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా రూపొందుతోంది.

విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘మాస్టర్’. ఈ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయి రిజల్ట్ ఇవ్వలేదు. అటు విజయ్ కి ఇటు లోకేష్ కి ఊహించని ఫ్లాప్ గా మాస్టర్ సినిమా నిలిచిపోయింది. తనకి షాక్ ఇచ్చినా విజయ్ మాత్రం లోకేష్ ని నమ్మి ఇంకో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తూ లోకేష్ కనగరాజ్, విజయ్ తో స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కమల్ vs విజయ్, సూర్య vs విజయ్, విజయ్ vs కార్తీ… లాంటి కాంబినేషన్ ని క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేసి ఛాన్స్ ఉన్నా కూడా లోకేష్ కనగరాజ్ ‘లియో’ సినిమాని సినిమాటిక్ యూనివర్స్ లో చెయ్యకుండా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. దీని కారణంగా థియేటర్స్ లో వచ్చే హైని ఆడియన్స్ మిస్ అవుతారు, అదే లియో కూడా LCU లో పార్ట్ అయ్యి ఉంటే కమల్, సూర్య, కార్తీ, సేతుపతి, ఫాహద్ ఫాన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టేవారు. ఈ విషయాలని పట్టించుకోకుండా లోకేష్ లియో సినిమాని సెపరేట్ సినిమాగా ఎందుకు చేస్తున్నాడో చూడాలి.

Exit mobile version