Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. విష్ణు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో లెక్కే లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు ఉన్నా.. పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ప్రమోషన్ల బాధ్యత మొత్తం భుజాన వేసుకున్నాడు విష్ణు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేసేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు.
Read Also : Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..?
కానీ సినిమాకు అతిపెద్ద సమస్య లెంగ్త్ అని తెలుస్తోంది. ఈ మూవీని 3 గంటల 15 నిముషాల వరకు నిడివి ఉంచినట్టు సమాచారం. ఇంత పెద్దగా లెంగ్త్ ఉండటం అంటే ప్రేక్షకులను కట్టిపడేయమే పెద్ద సవాల్. అన్ని గంటల పాటు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా మూవీ చూసేలా చేయడం పెను సవాల్. మొన్న కుబేర మూవీ ఎంత బాగున్నా.. నిడివి మీదనే విమర్శలు వచ్చాయి.
మూవీ కంటెంట్ బాగున్నా కొన్ని సార్లు నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు లాగ్ అనిపిస్తుంది. అంతసేపు ప్రేక్షకులు బోర్ అనే ఫీలింగ్ లేకుండా చూడాలంటే కట్టిపడేసే యాక్షన్ సీన్లు, సర్ ప్రైజ్ సీన్లు, దైవ భక్తి, ఎమోషన్ అన్నీ నిండుగా ఉండాలి. ఏ కొంచెం తేడా వచ్చినా కంటెంట్ లాగ్ ఉంది అనే భావన వెళ్తుంది. ఈ విషయంలో విష్ణు టీమ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
Read Also : Kingdom : అతని వల్లే కింగ్ డమ్ వాయిదా పడుతోందా..?