Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Legendary Singer Lata Mangeshkar Passes Away

మరపురాని మధురం… లతా మంగేష్కర్ మరి లేరు!

Published Date :February 6, 2022 , 10:04 am
By Prakash
మరపురాని మధురం… లతా మంగేష్కర్ మరి లేరు!

ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ పాట వినాలీ ప్రతిపూట – అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి!

లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. వారి కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకళాకారుడు. ఆయనకు ఐదు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. ఆమె తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. దీనానాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగానూ నటించారు లత. తరువాతి రోజుల్లో లత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు.

లత కంటే ముందు నూర్జహాన్, ఖుర్షీద్, సురయ్యా, షంషాద్ బేగం వంటి మేటి గాయనీమణులు రాజ్యమేలారు. వారు ఉన్న సమయంలోనే లత సైతం తనదైన బాణీ పలికించారు. తరువాతి రోజుల్లో లత పాటనే హిందీ సినిమాకు ఓ కొత్త బాటను చూపింది.

ఆ నాటి మేటి సంగీత దర్శకుల్లో నౌషద్ అలీదే పైచేయి. హిందుస్థానీ బాణీలకు జానపదం జోడించి నౌషద్ చేసిన ప్రయోగాలు ఆ కాలంలో జనాన్ని విశేషంగా అలరించాయి. లతలో అమృతం కురిపించే గానం దాగుందని నౌషద్ పసికట్టి ఆమెకు తగ్గ పాటలు పాడించారు. జనం మదిలో లతకు గానకోకిలగా పట్టం కట్టించారు. నౌషద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ బావ్రా’తోనే లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ ఇద్దరూ స్టార్ సింగర్స్ అయిపోయారు. తరువాత సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్ వంటి సంగీత దర్శకులు సైతం లత గానంలోని మధురాన్ని తమ బాణీలతో జోడీ కట్టించారు. జనానికి మరపురాని మధురాన్ని పంచారు.ఈ నాటికీ ఆ మధురం పరవశింప చేస్తూనే ఉంది. ఇక లతతో మదన్ మోహన్ స్వరపరచిన పాటలు విశేషంగా అలరించాయి.

లత పాట రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను రంజింప చేసిన తరువాతనే ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా అవార్డు లభించింది. ఈ అంశం అప్పట్లో ఆమె అభిమానులకు ఆవేదన కలిగించింది. అయితే లత ఏ నాడూ అవార్డుల కోసమే అన్నట్టుగా పాడలేదు.1972లో రూపొందిన ‘పరిచయ్’ చిత్రంలో గుల్జార్ రాసిన పాటకు ఆర్డీ బర్మన్ స్వరకల్పనలో లత గానం చేసిన పాట ఆమెకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. మరో రెండేళ్ళకు అంటే 1974లో ‘కోరా కాగజ్’ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ బాణీల్లో లతకు మరో నేషనల్ అవార్డు లభించింది. లతా మంగేష్కర్ ను మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం ‘లేకిన్’. ఈ చిత్రానికి ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు.

ఇక లత కీర్తి కిరీటంలో ప్రతిష్ఠాత్మక అవార్డులూ చోటు చేసుకున్నాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న లత దరి చేరాయి. ఇలా దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ లత గానామృతం చేరి మరింత వెలుగులు విరజిమ్మాయి.

తెలుగువారితోనూ లతకు విడదీయరాని బంధం ఉంది. 1955లో తెరకెక్కిన ఏయన్నార్ ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూన ఉంది. 1988లో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పలో “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు లత. ఇక 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. అలా నందమూరి, అక్కినేని కుటుంబాలతో లతకు అనుబంధం ఉంది. మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో యన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి.

మరపురాని మధురం పంచిన లతా మంగేష్కర్ గానం భావితరాలను సైతం పులకింప చేస్తూ మహదానందం కలిగిస్తూనే ఉంటుంది. ఇందులో ఎవరికీ ఏలాంటి సందేహమూ లేదని చెప్పవచ్చు.

ntv google news
  • Tags
  • Lata Mangeshkar
  • Lata Mangeshkar is no more
  • Lata Mangeshkar passes away
  • Legendary singer Lata Mangeshkar
  • RIP Lata Mangeshkar

WEB STORIES

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

RELATED ARTICLES

Lata Mangeshkar birth anniversary: అయోధ్యలోని చౌరస్తాకు లతా మంగేష్కర్ పేరు!

Lata Mangeshkar: అయోధ్యలో భారీ వీణ.. లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ ప్రారంభించనున్న ప్రధాని

Lata Mangeshkar: ఈ శతాబ్దం లత గానానిదే!

Deenanath Mangeshkar Award: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

BAFTA Awards : లతా మంగేష్కర్ కు ప్రత్యేక నివాళి

తాజావార్తలు

  • Dharmana Prasada Rao: అది మోసం కాదా.. అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కౌంటర్

  • Gary Ballance: జింబాబ్వే క్రికెటర్ హిస్టరీ.. రెండు దేశాల తరఫున..

  • Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్

  • Allu Arjun : అల్లు అర్జున్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అయాన్‌

  • Shanampudi Saidi Reddy : ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions