Charlie Chaplin: చాప్లిన్ ఆ విషయం తెలుసుకున్నారా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత చార్లీ చాప్లిన్ జన్మతః క్రిస్టియన్ అయినా, తరువాతి రోజుల్లో ఆయన మతం, వర్ణం అన్నవాటికి దూరంగా ఉన్నారు. మానవత్వమే అసలైన మతం అని తెలుసుకున్నానని తరువాత చెబుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చార్లీ చాప్లిన్ అంతటి ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన కాలంలో లేరు. ఆ తరువాత కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. తాను యేసు క్రీస్తు కంటే ఖ్యాతి చెందానని ఒకప్పుడు చెప్పుకున్నారు చాప్లిన్. దాంతో ఆయన జన్మించిన ఇంగ్లండ్, తరువాత వలస వెళ్ళిన అమెరికాలోనూ అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశారనే చెప్పాలి. అయినప్పటికీ మనసు బాగోలేనప్పుడు ఎంతోమంది చాప్లిన్ సినిమాలనే చూసి, ఆనందించేవారు. అలాంటివారు ఇప్పటికీ ఉన్నారు. ఒకానొక సందర్భంలో చాప్లిన్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన భార్యాపిల్లలు ఓ క్రైస్తవ గురువును తీసుకు వచ్చి ప్రార్థన చేయించారు. అప్పుడు ఆ గురువు “యేసు నీతో ఉండును గాక…” అంటూ దీవించారు. అందుకు మంచాన ఉన్నా, చాప్లిన్ తనదైన రీతిలో “యేసు క్రీస్తు అధ్యక్షునిగా ఉన్నట్టయితే, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. అది నాకు చేదుగా అనిపిస్తుంది” అని సెలవిచ్చారు. అక్కడా తనదైన హాస్యాన్ని చొప్పించారు చాప్లిన్.
అసలు దేవుడు లేడని, అంతా ప్రకృతిలోనే ఉందని తరువాతి రోజుల్లో చాప్లిన్ ప్రగాఢంగా విశ్వసించారు. యేసు క్రీస్తు పాత్రను కూడా ఎవరో సృష్టించారని ప్రఖ్యాత ఆంగ్ల గణితశాస్త్రవేత్త, తాత్వికుడు బెర్ట్రాండ్ రస్సెల్ అన్నారు. ఆ మాటతో చాప్లిన్ తానూ ఏకీభవిస్తాననీ చెప్పారు. మొత్తానికి చాప్లిన్ నటునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన తరువాత మతానికి దూరంగానే ఉన్నారు. యేసుక్రీస్తు అనేది కల్పిత పాత్ర అంటూ నమ్మిన చాప్లిన్ ఆశ్చర్యకరంగా 1977 డిసెంబర్ 25న అంటే ఏసుక్రీస్తు జన్మించారని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రైస్తవులు విశ్వసించే క్రిస్మస్ రోజున కన్నుమూశారు. ఇప్పటికైనా దేవుడు ఉన్నాడని చార్లీ చాప్లిన్ తెలుసుకొని ఉంటాడని ఆ తరువాత మతవిశ్వాసులు అనేవారు.
Also Read
- Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్
- Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం... తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
- JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
- Rashmika Mandanna: కృతి హాట్‌నెస్‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
తాజావార్తలు
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్‌గా ఉండాలా..? ప్రోటీన్ పవర్‌తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్‌గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..