నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న #NBK107 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బాలయ్య కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. #NBK107 షూటింగ్ నిన్న తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాకు రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా, సంగీత స్వరకర్తగా తమన్, ఎడిటర్ గా నవీన్ నూలి, డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా #NBK107 సెట్స్ నుండి లీకైన బాలకృష్ణ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Chiranjeevi : కే విశ్వనాథ్ సినిమా చేయడం అదృష్టం… తెలుగు వారికి వరం
ఈ లీకైన పిక్ నందమౌరి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పిక్‌లో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. బాలయ్యను చూసిన ఫ్యాన్స్ #NBK107 రూపంలో మరో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన ‘మఫ్టీ’ అనే సినిమాలోని లుక్ తో బాలయ్య లుక్ ను పోలుస్తున్నారు. ఇక బాలయ్య చివరిసారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ “అఖండ” చిత్రంలో కన్పించారన్న సంగతి తెలిసిందే.
