NTV Telugu Site icon

Leader 2: రానా-శేఖర్ కమ్ముల లీడర్ 2 రెడీ?

Leader 2

Leader 2

Leader 2 in Rana- Sekhar kammula Combination is getting Ready: రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతోనే హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి మరకలు తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి హిట్ టాక్ సంపాదించింది. 2010 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు.

The Family Star: అఫిషీయల్.. దేవర డేట్ పట్టేసిన దేవరకొండ..

గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి సరసన రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ లు హీరోయిన్లుగా కనిపించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సీక్వెల్ చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. రానా ప్రస్తుతానికి అనేక సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు కానీ అవి ఇప్పుడు పట్టాలు ఎక్కించే పనులు మాత్రం చేయడం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమా అయితే పెద్దగా బాడీతో కష్టపెట్టించాల్సిన అవసరం ఉండదు. రానాకి ప్రస్తుతం అదే కావాలి కాబట్టి ఈ సీక్వెల్ ను ఫైనల్ చేసి త్వరలో పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Show comments