NTV Telugu Site icon

Laya: పవన్ భోజనం చేయమన్నా చేయలేదు.. రావడమే గొప్ప అంటూ

Pawan

Pawan

Laya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఆయన అన్నా.. ఆయన వ్యక్తిత్వం అన్నా అభిమానులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఇష్టమే. అందుకే ఆయనతో సినిమా చేయాలనీ, తమ ఈవెంట్స్ కు, ఫంక్షన్లకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఆయన వస్తే ఫ్రీ పబ్లిసిటీ అని కూడా ఆలోచిస్తారు. ఇక పవన్ సైతం వారి ఆహ్వానాన్ని మన్నించి తనకు ఉన్న సమయంలోనే గెస్ట్ గా వెళ్లి కనిపిస్తూ ఉంటాడు. ఇక అలాగే పవన్, హీరోయిన్ లయ పెళ్ళికి వెళ్లారట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లయకు పవన్ అంటే చాలా ఇష్టమట. ఈ నేపథ్యంలోనే తన పెళ్ళికి అందరితో పాటు పవన్ ను కూడా ఆహ్వానించిందట. ఆయన వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ, పిలవాలని మాత్రం అనుకున్నదట. అయితే పవన్ పెళ్ళికి వచ్చినా కూడా ఆమె ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చింది.

Sudigali Sudheer: ఈరోజు నేను తినగలుగుతున్నాను అంటే దానికి కారణం ఆయనే

” 2006 లో నా వివాహం జరిగింది. నా పెళ్ళికి అందరిని పిలిచాను. పవన్ గారిని కూడా అలాగే పిలిచాను.. ఆయన వస్తారనినేను అనుకోలేదు. కానీ, ఆయన పెళ్ళికి వచ్చి ఆశ్చర్యపరిచారు. నేను వచ్చినందుకు థాంక్స్ అని చెప్పి.. భోజనం చేయమని కోరాను. అందుకు ఆయన.. ఏంటి.. భోజనమా అంటూ పక్కున నవ్వేసి స్టేజి మీద నుంచే బయటకు వెళ్లిపోయారు. ఆయన అలా అన్నందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ తరువాత అసలు పవన్ గారు రావడమే గొప్ప.. అనుకోని సరిపెట్టుకున్నాను. అసలు విషయం ఏంటంటే.. షూటింగ్ జరుగుతుండగా ఒక గంట గ్యాప్ తీసుకొని ఆయన పెళ్ళికి వచ్చారట. ఇక భోజనం కూడా చేస్తే లేట్ అవుతుందని వెళ్లిపోయారని తెల్సింది. తాన్ బిసి షెడ్యూల్ ను పక్కన పెట్టి నా కోసం వచ్చారని తెలిసి నేను ఎంతగానో ఆనందపడ్డాను. అదే నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని” లయ చెప్పుకొచ్చింది. ఇకపోతే లయ భర్త అమెరికాలో పెద్ద డాక్టర్.. పెళ్లి తరువాత ఆమె అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.