టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్ లు రీ ఎంట్రీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. మీరా జాస్మిన్, భూమిక లాంటి తారలు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో మెప్పిస్తున్నారు. ఇక ఆ తరహాలో కాకుండా లయ.. తనలోని నటనకు మెరుగులు దిద్ది ఇలా తన టాలెంట్ ని చూపిస్తోంది. మరి ఈ టాలెంట్ ను చూసి నిర్మాతలు ఏమైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.
Laya: ‘డీజే టిల్లు’ సాంగ్ కు సీనియర్ హీరోయిన్ ఊర మాస్ డాన్స్.. వీడియో వైరల్

Laya