Site icon NTV Telugu

Lawrence Bishnoi: సల్మాన్‌ ఖాన్‌ను క్షమించేదే లేదు

Lawrence Bishnoi On Salman

Lawrence Bishnoi On Salman

ఇటీవల సల్మాన్ ఖాన్‌కు తనతో పాటు తండ్రి సమీర్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వారే ఆ లేఖ పంపినట్టు పోలీసు విచారణలో తేలడంతో.. అతడ్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆ బెదిరింపు లేఖతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన బిష్ణోయ్.. తాజా విచారణలో మాత్రం తమ వర్గం ఎప్పటికీ సల్మాన్‌ని క్షమించదని బాంబ్ పేల్చాడు. ‘‘కృష్ణ జింత హత్య విషయంలో మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ని క్షమించదు. అతడు బహిరంగ క్షమాపణ చెప్తేనే క్షమిస్తాం’’ అని లారెన్స్ పేర్కొన్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

కాగా.. కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన విషయం తెలిసిందే! అతనికి కోర్టు జైలు శిక్ష విధించగా.. బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సల్మాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ఇదివరకే ఓసారి ప్రయత్నించింది. ఇప్పుడు మళ్ళీ బెదిరింపు లేఖ పంపించారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ వర్గీయులు కృష్ణ జింకను దైవంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ను ఆ వర్గం వాళ్లు టార్గెట్ చేశారు. ఇదిలావుండగా.. పంజాబి సింగర్ మూసేలా హత్యాకేసులోనూ లారెన్స్ బిష్ణోయ్‌ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కెనడాలో ఉంటోన్న లారెన్స్ స్నేహితుడు గోల్డీబ్రార్ అనే గ్యాంగ్‌స్టర్.. తామే సిద్ధూని చంపామంటూ కుండబద్దలు కొట్టాడు.

Exit mobile version