Site icon NTV Telugu

పెళ్లి గురించి వాళ్ళకే తెలుస్తుంది… అందాల రాక్షసి ఎటకారం

Lavanya-Tripati

డెహ్రాడూన్‌ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరోతో తన పెళ్లి గురించి కొంత కాలం క్రితం బలమైన పుకారు షికారు చేసింది. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి మౌనంగా ఉంది. అయిత్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ చాట్ సెషన్‌లో లావణ్య తన పెళ్లి, సదరు పుకార్ల గురించి స్పందించింది. నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే” గురించి టాపిక్ డైవర్ట్ చేసింది. అయితే అభిమానులు పెళ్లి గురించి పదేపదే అడగడంతో “కొంతమంది ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు. నా పెళ్లి గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తోంది” అంటూ ఎటకారంగా సమాధానం చెప్పడం గమనార్హం.

Read Also : “వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?

కొంతమంది నెటిజన్లు నటిని ఆమె పెళ్లి గాసిప్‌ను లేదా మొత్తం మెగా హీరో రూమర్‌ను ఖండిస్తున్నారా? అని అడిగారు. అయితే ఆమె దాని గురించి మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఇక ప్రస్తుతానికి ఆమె జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ సినిమా షూటింగ్ లో పాల్గొంటునట్టు తెలుస్తోంది. మత్తు వదలరా సినిమాకు దర్శకత్వం వహించిన రితేష్ రానా దర్శకత్వంలో “హ్యాపీ బర్త్‌డే” సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా గడుపుతోంది.

Exit mobile version