NTV Telugu Site icon

Lavanya Tripathi: మెగా కోడలు అప్పుడే మొదలెట్టేసింది..

Lavanya

Lavanya

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు అయితే అందుకోగలిగింది కానీ విజయాలను మాత్రం పట్టుకోలేకపోయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో మునిగితేలిన ఈ భామ .. ఎట్టకేలకు మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుంది. జూన్ 9 న వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. అయిది వరుణ్ తో పెళ్లి తరువాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇస్తుందని, మెగా కుటుంబం ఆమెకు కండీషన్ పెట్టిందని ఏవేవో పుకార్లు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని లావణ్య నిరూపించింది. తాజాగా ఆమె తన కొత్త సినిమా షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన పులి మేక సిరీస్ ద్వారా లావణ్య మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Prabhas: రాముడు వచ్చాడు కానీ రాక్షసుడు రాలేదు

జీ5 లో రిలీజ్ అయిన ఈ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అమ్మడు అదరగొట్టింది. ఇక తాజాగా ఈసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం రంగంలోకి దిగితున్నట్లు చెప్పుకొచ్చింది లావణ్య. సెట్ లో సీన్ పేపర్ చదువుతూ.. ఈసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం అమ్మడి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి తరువాత కూడా లావణ్య సినిమాలు చేస్తుందని తెలిసిపోయింది. మరి మెగా కోడలు ట్యాగ్ తో ముద్దుగుమ్మ హిట్ అందుకుంటుందేమో చూడాలి.