Site icon NTV Telugu

Raj Tarun Case : లావణ్య డ్రామా కంపెనీ.. ప్రతి రోజు నాలుగు ఆటలు

Raj Tarun

Raj Tarun

రాజ్ తరుణ్.. లావణ్య.. వీరిద్దరి వ్యవహారం డ్రామా కంపెనీని తలపిస్తోంది. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పెట్టుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది లావణ్య. దీంతో వీరి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటుండగా నిన్న మరోసారి వివాదం చెలరేగింది. లావణ్య ప్రస్తుతం ఉంటున్నకోకాపేట లోని ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పడంతో ‘ఇది నేను రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు ఎవరికి దీనిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నాం. ఈ ఇంటిపై నాకు హక్కు వుంది. నేను ఎక్కడికి వెళ్ళను’ అని రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గోడవకు దిగి వారిని ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. దింతో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.

Also Read : STR 49 : శింబు సినిమాలో కమెడియన్ గా ‘సంతానం’

అర్ధరాత్రి వరకు లావణ్య ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దీంతో ఈ వ్యవహారంలో రంగ ప్రవేశం చేసారు నార్సింగీ పోలీసులు. లావణ్య అసలు నా కొడలు కాదని ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపై ఉందని ఇది మాకు సొంతం అని, లావణ్య మా కొడుకుతో సహజీవనం చేసింది తప్పా నా కొడుకుని వివాహం చేసుకోలేదు, కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది. నా కొడుకు ఇంట్లో మేము ఉంటాం అని పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అనేక వాదనల అనంతరం లావణ్య కు నచ్చజెప్పి రాజ్ తరుణ్ తల్లితండ్రులను ఇంట్లోకి పంపించారు  పోలీసులు.

Exit mobile version