NTV Telugu Site icon

Lavanya vs Sekhar Basha: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య?

Lavanya Shekhar Basha

Lavanya Shekhar Basha

Lavanya attacks Sekhar Basha with Slipper: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం గురించి మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదు. రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం నడిపి 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనను వదిలేసి మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ తో తిరుగుతున్నాడని, తనతో ఉండే ఇంటి నుంచి వెళ్లిపోయి మాల్వితో కలిసి నివాసం ఉంటున్నాడని కూడా ఆమె ఆరోపించింది. అంతేకాదు మాల్వి మల్హోత్రా తన సోదరితో కలిసి తనను చంపేస్తానని బెదిరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందుకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద కేసులు నమోదు చేశారు.

Mita Vashisht: ఛాన్స్ ఇస్తా..రెండు నెలలు గడపమన్నాడు.. ఆ తెలుగు డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు

అవి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. నిన్న తిరగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ సమయంలో లావణ్య వచ్చి రచ్చ చేసింది. అదంతా ముగిసిన తరువాత తాజాగా ఒక ఛానల్లో లావణ్య తో పాటు రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకుంటున్న శేఖర్ భాషతో కలిపి ఒక లైవ్ షో ప్లాన్ చేశారు. శేఖర్ బాషా మాట్లాడుతున్న సమయంలో లావణ్య, లావణ్య మాట్లాడుతున్న సమయంలో శేఖర్ బాషా ఒకరికొకరు అడ్డుపడుతూ కనిపించారు. అదే సమయంలో లావణ్య కాలి చెప్పు తీసి శేఖర్ భాషా మీద దాడి చేస్తున్నట్టుగా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శేఖర్ బాష కూడా అదే రీతిలో ఆమె మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా సదరు ఛానల్ నిర్వాహకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరిని కలిపి ఇలా కూర్చోబెట్టి కొట్టుకునేదాకా వెళ్లడం ఏమాత్రం బాలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Show comments