Salaar: ప్రభాస్ ఎలివేషన్స్ కు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాధేశ్యామ్’ వంటి ఫ్లాప్ తర్వాత.. ‘సలార్’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ కూడా తన అప్‌కమింగ్ ఫిల్మ్స్ విషయంలో.. చాలా కేర్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ‘సలార్’ సినిమా తన అభిమానుల అంచనాలను మించేలా ఉండాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కూడా ‘కెజియఫ్’ని మించి సలార్‌ను రూపొందింస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అఫీషియల్, అన్ అఫీషియల్ పోస్టర్లు ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఇక దీంతో ‘సలార్’ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తనదైన స్టైల్లో ప్రశాంత్ నీల్.. రెండు మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాడట. ముఖ్యంగా ఎలివేషన్‌లు ఎక్కువ యాక్షన్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. దాంతో ‘సలార్’ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దుమ్ముదులపడం పక్కా అంటున్నారు. ఇక ఆ ఎలివేషన్స్ కు థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడం ఖాయమని సెట్ లో ఉన్నవారు అంటున్నారు.
ఇప్పటికే సలార్‌లో ప్రభాస్ రఫ్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు సినీ జనాలు. దాంతో ‘సలార్’ పై ఎనలేని అంచనాలున్నాయి. ఇక ఈ షూటింగ్ లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటోంది. తాజాగా ఈ బ్యూటీ.. ‘సలార్’ సెట్ నుంచి ఒక వీడియోని పోస్ట్ చెయ్యడం వైరల్‌గా మారింది. ఫుడ్ విషయంలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. సెట్‌లో ప్రభాస్‌తో పాటు తన చిత్ర యూనిట్‌కి కూడా ప్రభాస్ స్పెషల్ ఫుడ్ రుచి చూడాల్సిందే. దాంతో ఇప్పుడు సలార్ సెట్‌లో ఫుడ్‌ను వడ్డిస్తూ.. ప్రభాస్ ఫీస్ట్ ఆన్ సెట్స్ అంటూ.. వీడియోని పోస్ట్ చేసింది శృతి. ఇందులో ప్రభాస్‌కి థాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ‘సలార్’ సినిమా ప్రభాస్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!