Site icon NTV Telugu

Salaar: ప్రభాస్ ఎలివేషన్స్ కు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారట..?

Major Update On Salaar

Major Update On Salaar

‘రాధేశ్యామ్’ వంటి ఫ్లాప్ తర్వాత.. ‘సలార్’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ కూడా తన అప్‌కమింగ్ ఫిల్మ్స్‌ విషయంలో.. చాలా కేర్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ‘సలార్‌’ సినిమా తన అభిమానుల అంచనాలను మించేలా ఉండాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కూడా ‘కెజియఫ్‌’ని మించి సలార్‌ను రూపొందింస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అఫీషియల్, అన్ అఫీషియల్ పోస్టర్లు ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఇక దీంతో ‘సలార్’ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తనదైన స్టైల్లో ప్రశాంత్ నీల్.. రెండు మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాడట. ముఖ్యంగా ఎలివేషన్‌లు ఎక్కువ యాక్షన్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. దాంతో ‘సలార్’ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దుమ్ముదులపడం పక్కా అంటున్నారు. ఇక ఆ ఎలివేషన్స్ కు థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడం ఖాయమని సెట్ లో ఉన్నవారు అంటున్నారు.

ఇప్పటికే సలార్‌లో ప్రభాస్ రఫ్‌ లుక్ చూసి ఫిదా అవుతున్నారు సినీ జనాలు. దాంతో ‘సలార్’ పై ఎనలేని అంచనాలున్నాయి. ఇక ఈ షూటింగ్ లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటోంది. తాజాగా ఈ బ్యూటీ.. ‘సలార్’ సెట్ నుంచి ఒక వీడియోని పోస్ట్ చెయ్యడం వైరల్‌గా మారింది. ఫుడ్ విషయంలో ప్రభాస్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. సెట్‌లో ప్రభాస్‌తో పాటు తన చిత్ర యూనిట్‌కి కూడా ప్రభాస్ స్పెషల్ ఫుడ్ రుచి చూడాల్సిందే. దాంతో ఇప్పుడు సలార్ సెట్‌లో ఫుడ్‌ను వడ్డిస్తూ.. ప్రభాస్ ఫీస్ట్ ఆన్ సెట్స్ అంటూ.. వీడియోని పోస్ట్ చేసింది శృతి. ఇందులో ప్రభాస్‌కి థాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ‘సలార్’ సినిమా ప్రభాస్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version