మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దాదాపు 11 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ.. జులైలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారట. కాగా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుందని సమాచారం. మరోవైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ను వేగవంతం చేసే పనిలో పడ్డాడు. ఇదిలావుంటే, త్రివిక్రమ్ తమిళ స్టార్ హీరో సూర్యతోను సినిమా చేయనున్నట్లు వినిపిస్తోంది. మహేష్ తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా సూర్యతోనే అనే టాక్ నడుస్తోంది. అయితే సూర్య-బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా రాబోతున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
మహేష్ తో షూటింగ్ ప్రారంభించనున్న త్రివిక్రమ్.. సూర్యతోను?
