Site icon NTV Telugu

Rajamouli: మహేష్ తో ప్రాజెక్ట్.. కుదిరేలా లేదు అంటున్న రాజమౌళి..?

Mahesh

Mahesh

Rajamouli: ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఇప్పటికే రాజమౌళి, మహేష్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనున్నదని ప్రచారం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి అయ్యేలా కనిపించడం లేదట.. ఈ విషయాన్నీ స్వయానా జక్కన్నే చెప్పడం విశేషం. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడినప్పుడు రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

SSMB29 అనుకున్న విధంగా సెట్స్ పైకి వెళ్లడం జరగదు అని జక్కన్న చెప్పాడట. అందుకు కారణం త్రివిక్రమ్ మూవీనే అని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్- త్రివిక్రమ్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళాలి. కానీ అది జరగలేదు. ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో సగం టైమ్ ఇక్కడే పోతోంది. ఇక ఈ సినిమాను పూర్తి చేశాక కానీ మహేష్, రాజమౌళి సెట్ లో అడుగుపెట్టలేడు. అది కాకుండా జక్కన్న సినిమా అంటే భారీ కండలు, ఫిట్ నెస్ ఉండాలి. అందుకు మహేష్ సన్నద్ధం కావాలంటే మరో మూడు నెలలు పడుతోంది. ఇలా చూసుకుంటే జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లదని తెలిసే రాజమౌళి ఆ మాట అన్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ కు చేదు వార్తే. మరి త్రివిక్రమ్ ఇప్పటికైనా ఈ సినిమాను పట్టాలెక్కిస్తే బావుండు అని అభిమానులు అంటున్నారు.

Exit mobile version