Site icon NTV Telugu

Samantha: వారికి భయపడి ఇలా చేయడం న్యాయమా సామ్..?

Sam

Sam

Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సామ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకులు అయ్యాకా నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వస్తోంది. ఆమెపై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులుగా సామ్ సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. కారణం ఏంటో తెలియదు కానీ చాలా తక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి, అందులోనూ చాలా ముఖ్యమైన అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తోంది. దీంతో సమంతకు ఏమైంది..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ట్రోలర్స్ కూడా తమకు తోచిన సమాధానాలను చెప్పుకొస్తున్నారు.

కొంతమంది ట్రోలర్స్ కు భయపడి సమంత సైలెంట్ గా ఉంటుందని చెప్తుండగా మరికొంతమంది సినిమాలతో బిజీగా ఉండడం వలన సైలెంట్ గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొంతమంది చైతూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యేసరికి సామ్ సైలెంట్ అయ్యిపోయిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజమో తెలియదు కానీ సామ్ అభిమానులు మాత్రం సామ్ ను మిస్ అవుతున్నామని చెప్పుకొస్తున్నారు. ట్రోలర్స్ కు భయపడి మాతో మాట్లాడవా సామ్.. యాక్టివ్ గా మారలేవా..? అంటూ కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. మరి సామ్ అంతకుముందు లా ఎప్పుడు యాక్టివ్ అవుతుందో చూడాలి.

Exit mobile version