బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ లీల. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో శృంగార సన్నివేశాలు హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. రాముడి కథలో శృంగారం ఏంటని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమాలో రణవీర్- దీపికా మితిమీరిన శృంగారం చేశారట. ఒకానొక సమయంలో డైరెక్టర్ కట్ చెప్పినా కూడా వారు ఆగలేదని పలువురు చెప్తున్నారు. ఈ సినిమా షూట్ లో ఇద్దరు లిప్ లాక్ సీన్లలో నటిస్తుండగా ఆ ముద్దులో మునిగిపోయి డైరెక్టర్ కట్ చెప్పిన కుడా పట్టించుకోకుండా లిప్ లాక్ ని కొనసాగించరట.
ఇలా అందరిముందు ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా ఈ జంట ముద్దుల్లో మునిగితేలారట. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూ లో ని రణవీర్ ని మాట్లాడుతూ.. అప్పటికే తమ మధ్య ఉన్న బాండింగ్ మరింత బలపడటమే అందుకు కారణమై ఉండొచ్చని, లిప్ లాక్ సీన్లలో దర్శకుడు నటించమంటే ఇద్దరం జీవించేసామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడంటే వారికి పెళ్లి అయ్యింది కాబట్టి అప్పటి విషయాలు అందరికి నార్మల్ గా ఉన్నాయి. కానీ ఈ జంట పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే మాత్రం విమర్శలు మోయాల్సి వచ్చేది అని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు. ఏదిఏమైనా బాలీవుడ్ లో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువ అవుతుందని.. శృంగారం గురించి స్టార్ లు వేదికపై, ఇంటర్వ్యూ లలో బాహాటంగానే మాట్లాడేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
