ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాలతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక ఈయన చేసే ట్వీట్లు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిన విషయమే. ఇక గత కొన్ని రోజుల క్రితం ఎలన్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఎలన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే ఒక ఎయిర్ హోస్టెస్‌తో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఆయన ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్తా కథనం వెలువరించింది. ఇక నిత్యం అమ్మాయిలతోనే ఉండే ఈ కుబేరుడు తాజాగా పాతికేళ్ల కుర్ర హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు.
గత కొన్ని రోజుల నుంచి ఎలాన్, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు చెందిన నటి నటాషా బాసెట్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి ఫ్రాన్స్‌లోని ఓ హోటల్లో విడిది చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అత్యధిక ఖరీదు గల హోటల్లో ఈ జంట భోజనం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. 50 ఏళ్ల వయస్సులో కుర్ర హీరోయిన్ తో ప్రేమాయణం ఏంటీ..? అని కొందరు .. డబ్బు ఉండాలే కానీ వయస్సుతో సంబంధం ఏముంది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే మస్క్‌కి ఇప్పటికే వివాహం అవగా భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.
