Site icon NTV Telugu

అడవి శేష్ బ్యాక్ టు హోమ్… ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ?

Latest Health Update of Adavi Sesh

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన హెల్త్ అప్డేట్ గురించి వెల్లడించారు. డెంగ్యూ సోకడంతో ఆయన సెప్టెంబర్ 18న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శేష్ రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని, శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ అప్డేట్ వచ్చి దాదాపు వారం గడిచిపోతోంది. తాజాగా అడవి శేష్ స్వయంగా ట్విట్టర్ లో ‘ఇంటికొచ్చేశాను… రెస్ట్ తీసుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.

Read Also : మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనుకుంటున్నారు… కానీ…!

ప్రస్తుతం అడవిశేష్ “మేజర్” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల గురించి టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Exit mobile version