Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ లో హిట్ అయిన తేరి సినిమాకు అధికారిక రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే కేవలం సినిమా లైన్ మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు హరీష్ మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన పూజా హెగ్డే నటిస్తోందని వార్తలు వినిపించాయి. ఒరిజినల్ సినిమాలో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్లు సమంత, అమీ జాక్సన్ నటించారు. ఈ చిత్రంలో పవన్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారు.
Rashmika Mandanna: నీ కాళ్లను పట్టుకొని వదలంటున్నవి చూడే కుర్రాళ్ల కళ్లు..
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ సరసన కుర్ర బ్యూటీ శ్రీలీల నటించనున్నదని టాక్ నడుస్తోంది. అయితే అది పూజా ప్లేసా.. లేక పూజాతో పాటా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీలీల, అమీ జాక్సన్ ప్లేస్ లో నటిస్తోందని అంటున్నారు. ఒకవేళ శ్రీలీల ఆ పాత్రలో నటిస్తే.. మరి సమంత పాత్రలో ఎవరిని తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఈ విషయం తెలియడంతో.. పవన్ సరసన శ్రీలీల ఉన్నా ఒప్పుకుంటాం కానీ.. పూజా హెగ్డే అంటేనే కష్టంగా ఉంది. ఇక ఈ వార్త విన్నాకా.. ఆమె లేదు అనే విషయం కన్ఫర్మ్ అయ్యినట్లు అనిపిస్తోంది.. చాలా సంతోషంగా ఉంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.