ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ చేయబోతున్నాడా..? బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న మాట కొందరి నోట వినిపిస్తున్నా.. మహేష్ అందుకు సంసిద్ధంగా లేడు అన్న మాట మరికొందరు నోట వినిపిస్తుంది. అయితే మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి కోసం బడా నిర్మాతలు పోటీ పడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్రాల దర్శకుడు సూరజ్ భర్జత్య.. మహేష్ తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.
‘మైనే ప్యార్ కియా’ ‘హమ్ ఆప్ కే హై కోన్’ ‘హమ్ సాత్ సాత్ హైన్’ ‘వివాహ్’ చిత్రాలతో అటు హిందీ ప్రేక్షకులని కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించిన ఈ దర్శకుడు మహేష్ తో సినిమా చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నాడట.. ఇప్పటికి నమ్రతతో మంతనాలు జరిపి, మహేష్ ను ఒప్పించమని కోరుతున్నట్లు సమాచారం. ఇటీవలే సూరజ్ మహేష్, నమ్రతను కలిసి స్టోరీ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ మాత్రం తనకు తెలుగు సినిమాలు చాలని, . తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుంటే హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో సూరజ్ ప్రయత్నాలు ఫలిస్తాయా ..? నమ్రత, మహేష్ ను బాలీవుడ్ కు పంపిస్తుందా..? అనేది తెలియాల్సి అయింది. ఇకపోతే ప్రస్తుతం మహేష్ నటించిన సర్కారు వారి పాట రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
