Site icon NTV Telugu

Pooja Hegde: ఆ ఛాన్స్ మిస్ అయినందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్న బుట్టబొమ్మ..?

Pooja

Pooja

Pooja Hegde: చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటుందో వారికే అది దక్కుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఆపడం ఎవరి తరం కాదు. కొన్నిసార్లు డేట్స్ కుదరక, కథ నచ్చక, చిన్న సినిమా అని, నిడివి తక్కువ ఉందని రిజెక్ట్ చేస్తూ ఉంటారు హీరో హీరోయిన్లు. ఆలా రిజెక్ట్ చేసిన పాత్రకు హిట్ టాక్ రావడమో లేక మంచి పేరు రావడమో జరిగితే ఆ తరువాత వారు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే పరిస్థితిలో ఉందని టాక్ నడుస్తోంది. విషయం ఏంటంటే.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ ఠాకూర్ నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతగా మృణాల్ నటన టాలీవుడ్ అభిమానులను ఫిదా చేసేస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి మొదట ఈ పాత్ర కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంచుకున్నారని టాక్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పటికే పూజా రాధే శ్యామ్ లాంటి లవ్ స్టోరీలో నటించడం, ఇప్పుడు మరో లవ్ స్టోరీ అంటే కష్టం అనుకున్న ఆమె సున్నితంగా సీత పాత్రకు నో చెప్పడంతో ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ కు దక్కింది. ఇక సీతగా మృణాల్ కు పెద్ద విజయం దక్కడంతో పాటు టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ లభించింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడం, సీతను అందరు మెచ్చుకోవడంతో పూజా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. సీత పాత్రను వదిలేసినందుకు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తునట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఒక ఎపిక్ లవ్ స్టోరీని మిస్ చేసుకున్నందుకు పూజా కుమిలిపోతున్నదట. ఏదిఏమైనా పూజా ఈ సినిమా చేసి ఉంటే ఒక ఫ్రెష్ ఫీల్ మిస్ అయ్యేవాళ్లం అని అభిమానులు అంటున్నారు. దుల్కర్, మృణాల్ ఫ్రెష్ కెమిస్ట్రీ, మృణాల్ అమాయకత్వం అభిమానులను కట్టిపడేసిందని, ఆ ఫ్రెష్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడం వలనే లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. ఇది చూసాక ఏ పాత్ర ఎవరికోసం రాసిపెట్టి ఉంటుందో వారికే అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదేమో..

Exit mobile version