Site icon NTV Telugu

‘లక్ష్య’ ట్రైలర్: పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం

lakshya

lakshya

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల ‘వరుడు కావలెను’ చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ హిట్ తో జోష్ మీదున్న శౌర్య ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శౌర్య విలుకారుడిగా కనిపించాడు. ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి విలుకారుడు కావడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. మధ్యలో అతనికి అనుకోని అవరోధాలు ఎదురవుతాయి. తప్పు చేసైనా గెలుపు సాధించాలి అనే ధోరణిలో ఉన్న హీరోకు హీరోయిన్ స్ఫూర్తి నింపుతుంది.. క్రీడలలో ఉండే రాజకీయాలు, వాటివల్ల హీరో జీవితంలో వచ్చే మార్పులు.. చివరికి అనుకున్నది సాధించడానికి హీరో ఏం చేశాడు అనేది ఉత్కంఠభరితంగా చూపించారు.

స్పోర్ట్స్ మెన్ గా మారడానికి నాగ శౌర్య ఎంత కష్టపడ్డాడో ఆ చేంజ్ ఓవర్ చూస్తే తెలిసిపోతోంది. ఇక ఈ దహీరోకి గురువుగా జగపతి బాబు కనిపించాడు. కేతిక శర్మ రొమాన్స్ తో పాటు చిత్రాన్ని మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 10 న విడుదలకు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో హిట్ ట్రాక్ ని కొనసాగిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version